: ఎల్గర్... ఇది మీ జొహానస్ బర్గ్ కాదు!


దక్షిణాఫ్రికా జట్టులో అనతి కాలంలో స్టార్ బ్యాట్స్ మన్ గా మారిన ఆటగాడు ఎల్గర్. అతను క్రీజులో ఉంటే, ప్రత్యర్థి జట్టు ఓటమి ముందున్నట్టే. అలాంటి ఎల్గర్ ను ఔట్ చేసేందుకు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. దాన్ని అమలు చేసి విజయం సాధించడమే కాదు, ఎల్గర్ అవుట్ అయిన తరువాత దగ్గరకు వెళ్లి, "ఇది మీ జొహానస్ బర్గ్ కాదు" అని కూడా అన్నాడట. ఈ విషయాన్ని అశ్విన్ నిన్నటి మ్యాచ్ అనంతరం మీడియాకు స్వయంగా వివరించాడు. ఎల్గర్ గతంలో ఆడిన మ్యాచ్ లను చాలా చూశానని, గతంలో జొహానస్ బర్గ్ లో ఓకే రకమైన షాట్ ను ఎక్కువ ఆడటం గమనించానని తెలిపాడు. ఇండియాలో కూడా అదే విధమైన షాట్ ఎక్కువగా ఆడతాడని గమనించి, అందుకు తగ్గట్టు బంతిని వేసి బుట్టలో వేశానని వివరించాడు. కాగా, అశ్విన్ వేసిన బంతిని ఎల్గర్ లెగ్ సైడ్ స్వీప్ ఆడగా, అది బ్యాక్ వర్డ్ పాయింట్ లో ఉన్న జడేజా చేతుల్లోకి చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News