: రెండు బస్సుల మధ్య నలిగిపోయి వ్యక్తి దుర్మరణం


ఎదురుగా వస్తున్న రెండు బస్సుల మధ్య నుంచి వెళ్లబోయిన బైకిస్టు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో జరిగింది. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(35) బైక్‌పై వెళ్తున్నాడు. రుద్రవరం వద్ద రెండు బస్సుల మధ్య నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, అదే సమయంలో రెండు బస్సులు కదలటంతో వాటి మధ్యలో నలిగిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News