: వాళ్లిద్దరూ నాన్ లోకల్...పసునూరి మాత్రమే లోకల్: కడియం
కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, బీజేపీ అభ్యర్థి దేవయ్య నాన్ లోకల్ అభ్యర్దులని వారికి జిల్లా సమస్యలు తెలియవని, టీఆర్ఎస్ అభ్యర్థి తెలంగాణ ఉద్యమంలో జిల్లా వ్యక్తిగా చురుకుగా పాలుపంచుకున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ లో వడ్డెర సంఘం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. వడ్డెర కులస్తులను ఎస్టీల్లో చేర్చాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని, ఆ న్యాయమైన డిమాండ్ ను అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఎవరు పిలిచినా పలకే స్వభావమున్న పసునూరి దయాకర్ ను గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.