: రెండో బౌట్ కు విజేందర్ రెడీ
రెండో బౌట్ కు విజేందర్ సింగ్ (30) సై అంటున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన విజేందర్ సింగ్ గత నెలలో తొలి బౌట్ లో సోనీ వైటింగ్ తో తలపడి మూడో రౌండ్ లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ విజయం అందించిన ఉత్సాహంతో విజేందర్ సింగ్ రెండో బౌట్ లో డీన్ జిలెన్ (33) తో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. భారత కాలమానం ప్రకారం రేపు సాయంత్రం జరగనున్న మ్యాచ్ కోసం విజేందర్ సింగ్ కోచ్ సహా డబ్లిన్ చేరుకున్నాడు. గత నెల 31న జరగాల్సిన ఈ మ్యాచ్ ను సాంకేతిక కారణాల వల్ల రేపటికి పోస్ట్ పోన్ చేశారు. కాగా, విజేందర్ ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి గత నెల అరంగేట్రం చేయగా, డీన్ జిలెన్ గత మేలో అరంగేట్రం చేశాడు. ఇంత వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి మంచి జోరుమీదున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందని బాక్సింగ్ అభిమానులు అంచనా వేస్తున్నారు.