: కాపులను బీసీల్లో చేర్చడంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: సి.రామచంద్రయ్య
కాపులను బీసీల్లో చేర్చే విషయంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. పుట్టస్వామి కమిషన్ నివేదిక ద్వారా కాపులకు రిజర్వేషన్లు కల్పించవచ్చని, కానీ చంద్రబాబు కావాలనే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ ను వ్యతిరేకించిన బాబు, ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతులెలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని రామచంద్రయ్య ఆరోపించారు. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. ఈ సమావేశంలో 17 తీర్మానాలను నేతలు ఆమోదించారు. కేంద్రం తక్షణం ప్రత్యేకహోదా ప్రకటించాలంటూ ఈ నెల 9, 10న అన్ని జిల్లా కేంద్రాల్లో మట్టి సత్యాగ్రహాలు నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి 20 వరకు అన్ని మండల కేంద్రాల్లో కూడా మట్టి సత్యాగ్రహాలు నిర్వహించాలని తీర్మానించారు.