: రాజయ్యపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు?
కోడలు, ముగ్గురు మనవళ్ల సజీవదహనం కేసులో ఇరుక్కున్న కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను పార్టీ నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు టీఎస్ పీసీసీ కూడా అంగీకరించినట్టు సమాచారం. నేటి సాయంత్రం ఈ మేరకు ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కోడలి మరణం వెనుక ఆయన హస్తం కూడా ఉందని ప్రాథమిక సాక్ష్యాలు లభించడం, ప్రస్తుతం ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి.