: హైకోర్టులో మత్తయ్య క్వాష్ పిటిషన్... కొట్టివేయాలన్న ఏసీబీ... విచారణ వాయిదా


ఓటుకు నోటు కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో తదుపరి విచారణ వాయిదా పడింది. ఓటుకు నోటు కేసు నుంచి తన పేరు తొలగించాలంటూ అతను దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇవాళ విచారించింది. అయితే ఈ కేసులో మత్తయ్యపై ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేశామని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. అంతేగాక అతని పిటిషన్ ను కొట్టివేయాలని కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News