: బెంగళూరు బస్సులో యువతిపై అఘాయిత్యం!


బెంగళూరు సిటీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువతి(19) గ్యాంగ్ రేప్ కు గురైన సంఘటన కర్నాటకలో జరిగింది. బెంగళూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హో స్కోట్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు తెలిపారు. ఆ బస్సులో డ్రైవర్ గా రవి(26), క్లీనర్ గా మంజునాథ్(23) పనిచేస్తున్నారు. అదే బస్సులో పంతొమ్మిదేళ్ల యువతి ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో ఆ యువతిపై ఈ అఘాయిత్యం జరిగిందని పోలీసులు తెలిపారు. యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న ఆరోపణల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితురాలిని హోస్కోట్ లోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషయమై కర్నాటక హోం మంత్రి జి.పరమేశ్వర మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా సహించేది లేదని, నిందితులను వదలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.

  • Loading...

More Telugu News