: భారత ఆత్మలోనే సహనశీలత ఉంది: నఖ్వీ
భారత్ ఆత్మలోనే సహనశీలత ఉందని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దేశంలో సామరస్యానికి కొదవ లేదని, కేవలం రాజకీయాల కోసమే దేశంలో మత అసహనం నెలకొందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నవని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అధికారం దూరం కావడంతో కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. అందుకే ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ విమర్శించారు. భారతదేశం అంటేనే సహనశీలతకు మారుపేరని, దేశంలో అదే లేదని చెప్పడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు.