: ప్రత్యేక హోదాపై పోరాటమే కాంగ్రెస్ కు శ్రీరామ రక్ష: రఘువీరా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా మెరుగు పడిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. నలభై నుంచి నలభై ఐదు నియోజకవర్గాల్లో 25 నుంచి 30 వేల వరకు ఓట్లు వచ్చే పరిస్థితి ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీనే తొలుత ఉద్యమాన్ని ప్రారంభించిందని, ఆ తర్వాతే ఇతర పార్టీలు కూడా ముందుకు వచ్చాయని అన్నారు. ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో మట్టి సత్యాగ్రహాన్ని చేపడదామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలా చూడాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటమే కాంగ్రెస్ కు శ్రీరామ రక్ష అని అన్నారు. విజయవాడలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.