: ఏపీ సచివాలయంలోని చంద్రబాబు బ్లాక్ లో స్వల్ప అగ్ని ప్రమాదం


ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఈ ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కార్యాలయం ఉండే ఎల్ బ్లాక్ లోనే ప్రమాదం జరగడంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురై ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఎల్ బ్లాకులోని నాలుగో అంతస్తులో ఉన్న రెవెన్యూశాఖలో ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి, మంట విస్తరించకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టమూ జరగలేదని సమాచారం.

  • Loading...

More Telugu News