: ఇదేం పిచ్ రా బాబూ?... మనోళ్లూ మొదలెట్టారు!
ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్టులో పిచ్ అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది. సీమర్లు వేసిన బంతులను ఆటగాళ్లు బాదుతుంటే, కొత్త బంతి అయినా కూడా, స్పిన్నర్లు దుమ్ము రేపుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికాను 184 పరుగులకు కట్టడి చేసిన ఆనందం భారత ఆటగాళ్లలో నిమిషాల్లోనే మాయం అయింది. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి డక్కౌట్ అయ్యాడు. ఫిలాండర్ బౌలింగ్ లో డెవిలియర్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత స్కోరు 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 11 పరుగులు కాగా, 28 పరుగుల లీడింగ్ లో ఉంది. ఆటను చూస్తున్న క్రీడాభిమానులు మాత్రం తీవ్ర నిరాశతో 'ఇదేం పిచ్ రా బాబూ' అనుకోవాల్సిన పరిస్థితి.