: మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూల్లో అడిగిన 'ట్రిక్కీ' ప్రశ్నలివి!
మైక్రోసాఫ్ట్... ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటి. ఆ సంస్థలో ఉద్యోగం రావాలని కోరుకునే వారెందరో. మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోసం వెళితే, జరిగే ఇంటర్వ్యూల్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు? ఈ సందేహం ఎంతో మంది ఉద్యోగార్థుల్లో ఉంటుంది. వ్యక్తిగత విషయాలు, స్కిల్స్ పై ప్రశ్నలతో పాటు కొన్ని 'ట్రిక్కీ' ప్రశ్నలు సైతం ఎదురవుతాయి. అవి ఎలా ఉంటాయంటే... * అత్యుత్తమంగా డిజైన్ చేయబడ్డ వెబ్ సైట్లలో ఒకదాని గురించి చెప్పండి. (డిజైన్ విభాగంలో) * ఓ పేకల కట్ట సక్రమంగా కలిపారని ఎలా కనుగొంటారు? (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ విభాగంలో) * నువ్వు గూగుల్ సంస్థలో ఎందుకు చేరలేదు? (సీనియర్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ అభ్యర్థికి) * ఐఫోన్లకు ఆఫీస్ ప్రొడక్టులను డిజైన్ చేయాలన్న మైక్రోసాఫ్ట్ నిర్ణయంపై ఏమనుకుంటున్నారు? (సీనియర్ బిజినెస్ ఫ్లానర్ విభాగంలో) * మ్యాన్ హోల్స్ గుండ్రంగా ఎందుకుంటాయి? (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ విభాగంలో) * మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ను వాడుకుని షటిల్ సిస్టమ్ ను ఎలా తయారు చేస్తావు? (ప్రోగ్రామ్ మేనేజర్ విభాగంలో) * 24 గంటల సమయంలో చేతి గడియారంలోని చిన్న, పెద్ద ముల్లులు ఎన్నిసార్లు కలుస్తాయి? (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ విభాగంలో) * ఓ దీర్ఘకాల కస్టమర్ మీ సేల్స్ రిప్రజంటేటివ్ కారణంగా దూరమయ్యాడు. పరిస్థితిని మీరెలా మారుస్తారు? (సీనియర్ కన్సల్టెంట్ అభ్యర్థికి) * ల్యాప్ టాప్, కంప్యూటర్లు నిదానంగా ఆన్ అవుతుంటే, సమస్యను ఎలా పరిష్కరించాలి (కస్టమర్ సర్వీస్ అడ్వయిజర్ విభాగంలో) * ఐదేళ్ల చిన్నారికి ఓ సూత్రం చెప్పాలంటే ఎలా చెప్పాలి? (సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అభ్యర్థికి) * ఓ విమానాశ్రయాన్ని ఎలా డిజైన్ చేస్తావు? (ప్రోగ్రామ్ మేనేజర్ విభాగంలో) * (ఓ గడియారంలో 11:35 గంటల సమయం చూపి) రెండు ముల్లుల మధ్య కోణాన్ని ఏ ప్రాతిపదికన లెక్కిస్తావు? (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ విభాగంలో) * రాష్ట్రం వెలుపల లేదా బయటి దేశంలో పనిచేస్తున్న నీ టీం సభ్యుడితో బంధాన్ని ఎలా పెంచుకుంటావు? (ఎగ్జిక్యూటివ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ విభాగంలో) * ఓ క్లిష్టతరమైన సహ ఉద్యోగితో పనిచేయాలంటే ఎలా చేస్తావు? (సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ విభాగంలో) * ఓ కంపెనీ సీఈఓతో కలసి లిఫ్ట్ లో వెళుతున్నావనుకో... క్లౌడ్ పై 90 సెకన్లలో చెప్పాలంటే, ఎలా చెబుతావు? (టెక్నికల్ అకౌంట్ మేనేజర్ విభాగంలో) * అత్యధిక జన సందోహం మధ్య ఇరుక్కుపోయిన నువ్వు ఎలా బయటకు రాగలవు? (సైట్ మేనేజర్ విభాగంలో) * నీ దగ్గరున్న ప్రొడక్టులో ఓ స్టైలస్ ఉంది. దాన్నెలా స్టోర్ చేస్తావు? ఎలా చార్జ్ చేస్తావు. దానితో ఏమేం చేయగలవు? (మెకానికల్ డిజైన్ ఇంజనీర్ అభ్యర్థికి) * శరీరంపై ధరించగల ఓ సరికొత్త ప్రొడక్టును డిజైన్ చేసేందుకు నీ రీసెర్చ్ ప్లాన్ ఏంటి? (డిజైన్ రీసెర్చర్ విభాగంలో) * మాయం కావడం, గాల్లో ఎగరడం... ఈ రెండింటిలో ఓ సూపర్ పవర్ నీకిస్తానంటే ఏది ఎంచుకుంటావు?, ఎందుకు? (హై లెవల్ ప్రొడక్ట్ లీడ్ అభ్యర్థికి) * ఆఫీసులో సహోద్యోగిని వచ్చి, నీతో లైంగిక సంబంధం పెట్టుకునే ఆలోచన ఉందంటే... (ప్రోగ్రామ్ మేనేజర్ అభ్యర్థికి) * తన పర్సనల్ కంప్యూటర్ పనిచేయడం లేదని మీ నానమ్మ చెబితే, దగ్గర లేని నువ్వు ఎలా మార్గనిర్దేశం చేస్తావు? (సపోర్ట్ ఇంజనీర్ అభ్యర్థికి)