: తెలుగు రాష్ట్రాల్లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలకు నాణ్యతా ప్రమాణాలపై అమెరికా వార్నింగ్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నిర్వహిస్తున్న మూడు ఔషధ ఉత్పత్తుల తయారీ కేంద్రాలకు యూఎఫ్ ఎఫ్డీయే (యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణలోని మిర్యాలగూడ, ఏపీలోని శ్రీకాకుళం, దువ్వాడ ప్రాంతాల్లో డాక్టర్ రెడ్డీస్ నడుపుతున్న ప్లాంట్లలో ప్రమాణాలకు అనుగుణంగా ఔషధాలు తయారు కావడం లేదని ఆరోపిస్తూ, ఈ మేరకు వార్నింగ్ లెటర్స్ పంపింది. తాము అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించిన సంస్థ అధికారి ఒకరు యూఎస్ ఎఫ్డీయే హెచ్చరికలపై స్పందించేందుకు మాత్రం నిరాకరించారు.

  • Loading...

More Telugu News