: సౌదీ రాజు రహస్య భార్యకు భారీ పరిహారం
తాను దివంగత సౌదీ రాజు ఫద్ రహస్యంగా వివాహం చేసుకున్న భార్యనని, ఆయన ఆస్తిలో వాటా కావాలని కోర్టుకు ఎక్కిన బ్రిటన్ మహిళ జనాన్ హెర్బ్ కేసు గెలిచింది. ఆమెకు 15 మిలియన్ పౌండ్లను (సుమారు రూ. 151 కోట్లు), బ్రిటన్ లోని రెండు విలాసవంతమైన ఫ్లాట్లు ఇవ్వాలని కేసును విచారించిన న్యాయమూర్తి పీటర్ స్మిత్ తీర్పిచ్చారు. ఈ ఫ్లాట్ల విలువ ఒక్కోటి 5 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 50.05 కోట్లు) అంతకుముందు విచారణల సందర్భంగా తన తండ్రి ఆమె జీవనోపాధి నిమిత్తం ఇచ్చిన ఓ హామీని పాటిస్తామని సౌదీ యువరాజు అబ్దుల్ అజీజ్ బిన్ ఫద్ కోర్టుకు తెలిపారు. హెర్బ్ వయస్సు ఇప్పుడు 68 సంవత్సరాలు కాగా, ఆమెకు 19 సంవత్సరాల వయసున్నప్పుడు 1968లో ఆనాడు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిగా, యువరాజుగా ఉన్న ఫద్ ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడు.