: ఏపీకి బీజేపీ ఏం ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఐ రామకృష్ణ
ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అంతేగాక వెంకయ్య, చంద్రబాబులు చొరవ తీసుకొని ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో విలేకరులతో ఈ మేరకు ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి బీజేపీ ఏం ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. హోదా ఇవ్వాలనే డిమాండ్ తో డిసెంబర్ 7 నుంచి ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు.