: ముంబైలో 75, ఢిల్లీలో 10... తేలిన చోటా రాజన్ పై నమోదైన కేసుల సంఖ్య


దాదాపు రెండు దశాబ్దాల వేట తర్వాత మాఫియా డాన్ చోటా రాజన్ ఎట్టకేలకు సీబీఐ అధికారుల అదుపులోకి వచ్చేశాడు. ఆస్ట్రేలియా నగరం సిడ్నీ నుంచి జింబాబ్వే వెళుతున్న చోటా రాజన్ ను ఇండోనేసియా పోలీసులు ఇంటర్ పోల్ సహకారంతో బాలి ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు హుటాహుటిన బాలి వెళ్లి ఇండోనేసియా అధికారులతో చర్చించి నిన్న రాత్రి చోటా రాజన్ ను ఢిల్లీకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అసలు చోటా రాజన్ పై దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి? అన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ముంబైలోనే ఏకంగా 75 కేసులు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా అతడిపై 10 కేసులు నమోదయ్యాయి. కాగా, ముంబై పోలీసులు తాము చోటా రాజన్ పై నమోదు చేసిన మొత్తం 75 కేసులను సీబీఐకి బదిలీ చేయనున్నారు. వీటిన్నింటినీ గుదిగుచ్చి సీబీఐ విచారిస్తుంది.

  • Loading...

More Telugu News