: ఆ జైలులో డ్రగ్ పెడ్లర్ ఎవరో తెలిస్తే షాక్ తింటారు!
డ్రగ్ సరఫరాపై పోలీసుల నిఘా పెరిగినప్పుడు స్మగ్లర్లు డ్రగ్స్ ను తరలించేందుకు వినూత్న పంథాను ఎన్నుకుంటారు. ఈ సమయంలో డ్రగ్ పెడ్లర్లుగా చిన్నపిల్లలు, చిన్న ట్రాన్స్ పోర్టర్లను ఎన్నుకుంటారు. కానీ బ్రెజిల్ లోని అరజ్వైనా పట్టణంలోని బర్రా డా గ్రోటా జైలులో ఖైదీల మధ్య డ్రగ్స్ సరఫరా చేసేది ఓ చిట్టెలుక. చిట్టెలుక డ్రగ్స్ ఎలా సరఫరా చేస్తుందని అనుమానం వచ్చిందా? సదరు ఎలుక తోకకు ఓ తాడును కట్టి జైలులో ఖైదీలు తమ స్నేహితులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. తోకకు డ్రగ్ ప్యాకెట్ తగిలించుకున్న చిట్టెలుక జైలులోని బ్యారక్ ల మధ్య తిరుగుతూ సీసీ కెమెరాలకు చిక్కి, ఖైదీల డ్రగ్ డీల్ ను బయటపెట్టింది. దీంతో తనిఖీలు నిర్వహించిన జైలు అధికారులకు 30 గంజాయి పాకెట్లు, 20 కొకైన్ పాకెట్లు లభించాయట.