: చోటా రాజన్ కేసును సీబీఐకి అప్పజెపుతాం: ‘మహా’ అడిషనల్ హోం సెక్రటరీ


గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కేసును సీబీఐ విచారించనున్నట్లు మహారాష్ట్ర హోం శాఖ అదనపు కార్యదర్శి కేపి బక్షి వెల్లడించారు. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పజెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. చోటా రాజన్ కేసు విచారణ మొత్తం సీబీఐ చూసుకుంటుందని చెప్పారు. ట్రాన్స్-నేషనల్ కేసుల విచారణలో సీబీఐ అధికారులకు ఎంతో అనుభవం ఉంటుంది కనుక ఈ కేసును కూడా వారికే అప్పజెప్పనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అవసరమైన సహకారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తుందన్నారు. సీబీఐ అధికారుల నిర్ణయం మేరకు ఈ కేసు విచారణ ఢిల్లీలో లేదా ముంబయిలో జరుగుతుందన్నారు. ముంబయిలో విచారణ నిర్వహించాలనుకుంటే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని బక్షీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News