: అధిక శాతం ముస్లిం ఓట్లు మహాకూటమికే పడ్డాయి : సీ ఓటర్ సర్వే వెల్లడి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 84 శాతం ముస్లిం ఓట్లు నితీష్-లాలూ కూటమికే పడ్డాయని టైమ్స్ నౌ సీఓటర్ సర్వే ప్రకటించింది. కేవలం 8 శాతం ముస్లింలు మాత్రమే తమ ఓట్లను బీజేపీకి వేసినట్లు ఆ సర్వే పేర్కొంది. ఇతర రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు మిగిలిన 8 శాతం ముస్లిం ఓట్లు పోలైనట్లు సీ సర్వే ప్రకటించింది. కాగా, మొత్తం ఐదు దశలలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నేటితో ముగిశాయి. ప్రజల ఓట్లు కొల్లగొట్టుకునేందుకు ఆయా పార్టీలు ఎన్నో ప్రచార సభలు నిర్వహించాయి. ‘బీఫ్’పై బీజేపీ నేతల రాద్ధాంతం మహాకూటమి నేతలకు కలిసొచ్చింది. దీనిని ప్రచారాస్త్రంగా చేసుకుని మరిన్ని విమర్శలు మోదీ ప్రభుత్వంపై గుప్పించిన విషయం తెలిసిందే.