: సహనశీలత లేదనడం వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటోంది: వెంకయ్యనాయుడు
దేశంలో సహనశీలత లేదనడం వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎక్కడో ఒకటి రెండు రాష్ట్రాల్లో జరిగిన ఘటనల వల్ల దేశంలో మత అసహనం పెరిగిపోతోందని పేర్కోవడం సరికాదని అన్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఆందోళన చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. సాహితీ వేత్తలు, సినీ ప్రముఖులు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేయడంపై ఆయన ఓ పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో మత అసహనం పెరగడం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొన్నారు.