: మీ ముఖం కొలతలను బట్టి మీరెలాంటి వారో చెప్పేయచ్చు!


ముఖాకృతిని బట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. చీక్ బోన్ (దవడ ఎముక) ఆకారం వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని వారు చెబుతున్నారు. దవడ ఎముకను బట్టి ముఖాకృతి ఉంటుందని వారు సూచిస్తున్నారు. అయితే చీక్ బోన్ కొలతలు ఎలా తెలుసుకోవాలంటే... ఓ ఫోటోను తీసుకుని రెండు చీక్ బోన్ ల మధ్య దూరం కొలవాలి. ఇది వెడల్పు అవుతుంది. అలాగే పైపెదవి నుంచి కనుబొమ్మల వరకు ఒక కొలత తీసుకోవాలి ఇది పొడవు అవుతుంది. ఈ వెడల్పును ఎత్తుతో భాగించగా వచ్చిన సంఖ్యే మీ చీక్ బోన్ సైజ్ అవుతుంది. 'ఇది మీరు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకునే విధానం' అని పరిశోధకులు చెబుతున్నారు. వెడల్పు ముఖం ఉన్నవారు ఆగ్రహావేశాలు కలిగి ఉంటారని వారు చెబుతున్నారు. సన్నని ఆకృతి ముఖం కలిగి ఉన్నవారు నిజాయతీగా, ప్రశాంతంగా ఉంటారని వారు వెల్లడించారు. ముఖం సంఖ్యలు భాగించగా 1.5 నుంచి 2.1 వరకు వచ్చిన వారు వెడల్పాటి ముఖం వారని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనను 2010లో ఫుట్ బాల్ ఆడిన ప్రముఖ క్రీడాకారులపై నిర్వహించారు. వెడల్పాటి ముఖం కలిగిన వారు ఎక్కువ తప్పులు చేశారని పరిశోధనల్లో తేలిందని వారు వివరించారు.

  • Loading...

More Telugu News