: టికెట్ ధరలపై ఆఫర్లు ప్రకటించిన ఎయిర్ ఏషియా
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రయాణ టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. దేశీయ విమానయానం ప్రారంభ ధర 1269 రూపాయలుగా ఎయిర్ ఏషియా తెలిపింది. ఆఫర్ల ధరల్లో టికెట్లను ఈనెల 8వ తేదీలోపు బుక్ చేసుకోవాలని పేర్కొంది. 2016 జనవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు దేశీయ ప్రయాణాలు చేయాల్సి ఉండగా, అంతర్జాతీయ ప్రయాణాలు జనవరి 15 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు చేయాల్సి ఉంటుందని ఎయిర్ ఏషియా స్పష్టం చేసింది. బెంగళూరు నుంచి కొచ్చికి 1269 రూపాయలు కాగా, బెంగళూరు నుంచి గోవాకు 1469 రూపాయలుగా, బెంగళూరు నుంచి ఢిల్లీకి 3,469 రూపాయలుగా టికెట్ ధరలను నిర్ణయించింది. అలాగే ఎయిర్ ఏషియా అంతర్జాతీయ టికెట్ ధరలలో కూడా ఆఫర్లు ప్రకటించింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి భారత్ లోని కొచ్చికి 3,399 రూపాయలుగా పేర్కొంది.