: కొనసాగుతున్న నామినేషన్ల పరిశీలన
వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక కోసం మొత్తం 38 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని వరంగల్ కలెక్టరేట్ లో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ తరపున పసునూరి దయాకర్, కాంగ్రెస్ తరపున సర్వే సత్యనారాయణ, టీడీపీ బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా దేవయ్య, వైకాపా అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్ నామినేషన్ వేశారు. ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుపుతారు. తన కోడలు, ముగ్గురు మనవళ్లు అగ్నికి ఆహుతి అయిన నేపథ్యంలో, ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్య తప్పుకున్న సంగతి తెలిసిందే.