: సిరిసిల్లను కఠినంగా శిక్షించాలి... ఎంజీఎం మార్చురీ ముందు ఎర్రబెల్లి ధర్నా


సిరిసిల్ల రాజయ్య కోడలు, మనవల మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తయిన మరుక్షణం వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురీ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తన అనుచరులతో కలిసి వచ్చి ఎంజీఎం మార్చురీ ముందు నడిరోడ్డుపై బైఠాయించారు. కూతురు లాంటి కోడలు, ముక్కుపచ్చలారని ముగ్గురు మనవల మరణానికి కారణమైన సిరిసిల్ల రాజయ్యను, ఆయన కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలని ఎర్రబెల్లి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఘటన జరిగిన తీరుపై అనుచరుల నుంచి సమాచారం సేకరించిన ఎర్రబెల్లి ఎంజీఎంకు వచ్చి ఆందోళనకు దిగారు. ఊహించని విధంగా ఎర్రబెల్లి ఎంజీఎం వద్ద ఆందోళనకు దిగగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News