: ఎర్రగడ్డ శ్మశానవాటికలో కొండవలస అంత్యక్రియలు పూర్తి
హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 2న అనారోగ్యంతో నిమ్స్ లో కొండవలస కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో ఉంటున్న ఆయన కుమార్తె కోసం భౌతికకాయాన్ని నిమ్స్ మార్చురిలోనే ఉంచారు. ఈ క్రమంలో ఇవాళ కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకుముందు పలువురు సినీనటులు కొండవలసకు నివాళులర్పించారు.