: రఘువీరారెడ్డికి అస్వస్థత
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఆయన విశాఖపట్నంలోని శారదా పీఠంలో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతుండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే రఘువీరాను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయనకు షుగర్ లెవెల్స్ పడిపోయినట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.