: మారని టీమిండియా... తొలి ఇన్నింగ్స్ లో ఘోర వైఫల్యం!


ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమైన వేళ, మిగతా బ్యాట్స్ మన్లూ అదే దారిలో నడిచారు. 40 ఓవర్లు పూర్తి కాకుండానే ఇండియా 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు మరో ఓపెనర్ మురళీ విజయ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అజింక్య రహానేతో కలసి భారత స్కోరును ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు భుజాన వేసుకోగా, 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా కూడా డక్కౌట్ అయ్యాడు. మురళీ విజయ్ మాత్రం తనదైన శైలిలో ఆడుతూ కెరీర్ లో 12వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందుకోసం మొత్తం 115 బంతులాడిన విజయ్ 8 ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం విజయ్ 56 పరుగులతో కొనసాగుతున్నాడు. భారత స్కోరు 40 ఓవర్లలో 111/5. ఇక మిగిలింది బౌలర్లే కావడంతో భారత జట్టు ఏ మేరకు స్కోరును నమోదు చేస్తుందన్న విషయమై సందేహాలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News