: బీజేపీ నేతలు చంద్రబాబును విమర్శించడం మానుకోవాలి: డొక్కా
ఏపీలో ఇటీవల బీజేపీ నేతలు ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై చేస్తున్న విమర్శలపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. గుంటూరులో టీడీపీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ, బీజేపీ నేతలు మిత్రధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబును విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలన్నారు. రాజకీయంగా ఉనికి లేని సందర్భంలోనే కాపుల గురించి మాట్లాడే నేతల పట్ల కాపులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. బీజేపీ నాయకురాలు పురందేశ్వరి రాజకీయ నేతలా కాకుండా, కాగ్ ప్రతినిధిగా మాట్లాడం హాస్యాస్పదమని అన్నారు. రాయలసీమలో మరోసారి తప్పటడుగులు వేయవద్దని వైసీపీ నేతలకు వినతి చేస్తున్నానని తెలిపారు.