: అమరావతి కోసం నిబంధనల అతిక్రమణ... బాబు సర్కారుకు గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్ ఆదేశాలను తుంగలో తొక్కారని దాఖలైన పిటీషన్ పై వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ, చంద్రబాబు సర్కారుకు నోటీసులు జారీ అయ్యాయి. పర్యావరణ చట్టాలను పాటించలేదని, పలు నిబంధనలను ప్రభుత్వం అతిక్రమించిందని శ్రీమన్నారాయణ అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కారు, కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీయే), కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు పంపిన ట్రైబ్యునల్, కేసు విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది.