: వొడాఫోన్ నుంచి దీపావళి ఆఫర్... ఆ ఒక్కరోజే 100 ఎంబీ డేటా ఉచితం


వినియోగదారులను ఆకర్షించేందుకు పలు కంపెనీలు దీపావళిని క్యాష్ చేసుకుంటాయి. ఇప్పటికే పలు సంస్థలు డిస్కౌంట్ ఆఫర్ లు ప్రకటించగా, తాజాగా వొడాఫోన్ కంపెనీ కూడా దీపావళి ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 11న అంటే దీపావళి ఒక్కరోజు 100 ఎంబీ డేటాను కస్టమర్లు ఉచితంగా వినియోగించుకోవచ్చంటూ ప్రకటించింది. ఇందుకోసం వొడాఫోన్ కస్టమర్లు 'DIWALI' అని టైప్ చేసి 199 నంబర్ కు ఎస్ఎంఎస్ పంపాలి. దాంతో ఉచిత డేటాను పొందుతారని ఓ ప్రకటనలో వొడాఫోన్ తెలిపింది.

  • Loading...

More Telugu News