: అత్యాచారానికి గురైన మహిళ బిడ్డకూ ఆస్తిలో వాటా: అలహాబాద్ హైకోర్టు


మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమె తల్లయితే, పుట్టిన బిడ్డకు నిందితుడి ఆస్తిపై వారసత్వపు హక్కు వచ్చినట్టేనని, అందుకు కోర్టు ఆదేశాలు అక్కర్లేదని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే తరహా కేసును విచారించిన జస్టిస్ షాబిహుల్ హస్నైన్, జస్టిస్ డికె ఉపాధ్యాయతో కూడిన డివిజన్ బెంచ్, బిడ్డ ఎవరికీ దత్తతకు వెళ్లకుంటే ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందేనని, ఎవరికైనా దత్తతకు వెళితే మాత్రమే ఆ హక్కు ఉండదని స్పష్టం చేసింది. బిడ్డ అత్యాచారం కారణంగా పుట్టాడా? లేక ఆమె సమ్మతితో జన్మించాడా? అన్నది ప్రశ్నే కాదని, ఎలా జరిగినా నిందితుడే తండ్రని తెలిపింది. జన్మకు కారణమైన వ్యక్తి ఆస్తిలో బిడ్డకు హక్కు పుట్టుకతోనే వస్తుందని బెంచ్ వివరించింది.

  • Loading...

More Telugu News