: మంత్రి గంటా ఇంట వేడుకగా రిసెప్షన్... హాజరైన వెంకయ్య, చంద్రబాబు, నరసింహన్


మొన్న ఏపీ మంత్రి నారాయణ ఇంట కల్యాణం కనువిందు చేస్తే, నిన్న మరో మంత్రి గంటా శ్రీనివాస్ ఇంట విందు వేడుకగా జరిగింది. గంటా కొడుకు రవితేజ వివాహం నారాయణ కూతురు శరణితో మొన్న నెల్లూరులో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన విందు నిన్న రాత్రి గంటా సొంతూరు విశాఖలో ప్రముఖుల హాజరుతో కళకళలాడింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ కేబినెట్ లోని దాదాపు అందరు మంత్రులు ఈ విందుకు హాజరయ్యారు. ఇక ఒకప్పటి టీడీపీ నేతలు... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఈ విందులో తళుక్కుమన్నారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు, టీ టీడీపీ చీఫ్ ఎల్.రమణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, అల్లు అరవింద్, శ్రీకాంత్, సునీల్ తదితరులు కూడా ఈ విందుకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

  • Loading...

More Telugu News