: టాస్ మనదే!... తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన


ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా మరికాసేపట్లో ‘టెస్టు’ సమరం మొదలు కానుంది. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మొహాలీలో నేడు తొలి టెస్టు ప్రారంభం అవుతోంది. ఇందులో భాగంగా టాస్ లో నెగ్గిన టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పర్యాటక జట్టును ఫీల్డింగ్ కు ఆహ్వానించాడు. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే టైటిళ్లను చేజార్చుకున్న టీమిండియా టెస్టు టైటిల్ ను అయినా దక్కించుకుని పరువు నిలుపుకోవాలని యత్నిస్తోంది. మరోవైపు ప్రత్యర్థి జట్టు సొంత గడ్డపైనే రెండు టైటిళ్లను సులువుగా చేజిక్కించుకున్న సఫారీలు టెస్టు టైటిల్ ను కూడా సాధించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో నేటి టెస్టు రసవత్తరంగా సాగనుంది.

  • Loading...

More Telugu News