: ఓవైపు యాదవులు, మరోవైపు ముస్లింలు... నేడు అత్యంత కీలకం!


బీహారులో తుది దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 57 నియోజకవర్గాల్లోని 1,55,43, 594 మంది ఓటర్ల కోసం 14,709 పోలింగ్ కేంద్రాలు తెరచుకున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ముస్లింలతో పాటు యాదవుల ఓట్ల సంఖ్య కూడా అత్యధికంగా ఉంది. దీంతో నేడు యాదవులు, ముస్లింలు ఎవరికి అనుకూలంగా తిరిగితే, వారికి గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని రాజకీయ పండితులు ఊహిస్తున్నారు. మరోవైపు ఎంఐఎం పార్టీ సైతం ముస్లింల జనాభా అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో బరిలోకి దిగింది. ఇతర పార్టీల జయాపజయాలను శాసించే స్థితిలో ఎంఐఎం కనిపిస్తోంది. మరోవైపు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే, ఓట్లేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. నాలుగో విడత పోలింగ్ లో రికార్డు స్థాయిలో ప్రజలు ఓట్లు వేసినందున, ఈ దఫా కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని అంచనా. పెరిగిన పోలింగ్ శాతం ఎవరిపై ప్రభావం చూపుతుందో మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. మొత్తం 33 కంపెనీల రాష్ట్ర పోలీసులు, పారా మిలటరీ బలగాలు బందోబస్తును నిర్వహిస్తుండగా, సమస్యాత్మకమైన 5,518 కేంద్రాలు, నక్సల్స్ ప్రాంతాల్లోని 276 కేంద్రాల వద్ద మరింత బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా 2 నియోజకవర్గాల్లో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది.

  • Loading...

More Telugu News