: ఈ కుర్చీలో కూర్చుని పనిచేస్తే అలసటనేది తెలియదు!


ఈ కుర్చీలో కూర్చుని పని చేస్తే అలసటే తెలియదట. వెనక్కి వాలి కూర్చుని తల మీదుగా ల్యాప్‌టాప్, లేదా కంప్యూటర్ సెట్ చేసుకోవచ్చు. వర్క్ స్టేషన్ నుంచి కంటికి ఎంత దూరం ఉండాలో అంత ఉంటుంది.ఈ కుర్చీలో కూర్చునే కాదు, పడుకుని కూడా పని చేసుకోవచ్చు. నిటారుగా కూర్చుని పనిచేస్తూ, వెన్నెముక, ఒబేసిటీ సమస్యలతో బాధపడుతున్న వారికోసం సోనోమా దేశంలో ఈ ఫ్లెక్సిబుల్ ఆల్ట్‌వర్క్ స్టేషన్ తయారుచేశారు. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు, వారి ఆరోగ్యాన్ని కూడా ఓ కంట కనిపెడితే ఉద్యోగులకే కాదు సంస్థకు కూడా లాభమే. కంప్యూటర్ ముందు పనిచేస్తే మెడ, వెన్నునొప్పులు రావడం కామనే. అలా కాకుండా వెన్నుపూసకు, మెడకు విశ్రాంతినిచ్చేలా ఈ కుర్చీలో కూర్చుని పనిచేస్తే చాలా ఉపయోగమని కుర్చీ తయారీదారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News