: షారూక్ పై మండిపడ్డ బాబా రాందేవ్ !


బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ వ్యాఖ్యలు, దానిపై బీజేపీ నేతల స్పందనలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, యోగ గురువు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. షారుఖ్ పై ఆయన మండిపడ్డారు.‘మత అసహనంపై బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఆందోళన చెందుతున్న మాట నిజమే అయితే, ఆయన తీసుకున్న పద్మశ్రీ అవార్డుతో పాటు నగదు బహుమతిని కూడా ఇచ్చివేయాలి. బహుమతిగా వచ్చిన డబ్బును ప్రధాని సహాయ నిధికి జమ చేయాలి’ అని యోగ గురువు రాందేవ్ బాబా అన్నారు. కాగా, షారుక్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సాధ్వి ప్రాచీ, కైలాష్ విజయ్ వర్గీ మొదలైన వారు మండిపడ్డారు. మరింత ఘాటుగా ఈ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేతల తీరును సొంత పార్టీ నేతలు కూడా సమర్థించకపోవడం తెలిసిందే. వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలంటూ వారికి హితవు పలకడం విదితమే. తాజాగా, షారూక్ పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు విజయ్ వర్గీ ప్రకటించారు.

  • Loading...

More Telugu News