: ఎవరెస్టును గెలిచాడు...నిజాం కాలేజీ సీనియర్ల చేతిలో ఓడాడు
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆనంద్ కళాశాలలో సీనియర్ల చేతిలో ర్యాగింగ్ కు గురయ్యాడు. హైదరాబాదులోని నిజాం కళాశాల హాస్టల్ లో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఎవరెస్టును అధిరోహించి, నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఆనంద్ సీనియర్ల చేతిలో వేధింపులకు గురయ్యాడు. ర్యాగింగ్ కు గురైన ఆనంద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు.