: ముస్లిం అయినందుకు షారుక్ ను టార్గెట్ చేయడం సరికాదు: శివసేన
సినీ నటుడు షారుక్ ఖాన్ పై బీజేపీ నేతలు, ఎంపీలు వరుస విమర్శలు చేస్తుండటంతో శివసేన అతనికి మద్దతుగా నిలిచింది. ఒక ముస్లిం అయినందున ఆయనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం సరికాదంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలా ఓ నటుడిపై విమర్శలు చేయడం సమంజసం అనిపించుకోదని శివసేన అభిప్రాయపడింది.