: వచ్చే నెల 2న రిటైర్ కానున్న చీఫ్ జస్టిస్ దత్తు... తదుపరి సీజేఐగా ఠాకూర్ పేరు


భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) హెచ్.ఎల్.దత్తు వచ్చే నెల 2వ తేదీన పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సీనియర్ మోస్ట్ జడ్జి, జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ పేరును దత్తు సిఫారసు చేశారు. పదవీ విరమణ పొందనున్న ప్రధాన న్యాయమూర్తి ఈ విధమైన సిఫారసు చేయడం సంప్రదాయం ప్రకారం వస్తున్నదే. సీజేఐ చేసిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపి, ఆయన అనుమతి లభించిన తర్వాత నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. ఠాకూర్ ఆ పదవిలో 13 నెలల పాటు కొనసాగుతారు. అంటే, జనవరి 3, 2017న ఠాకూర్ పదవీ విరమణ పొందుతారు. కాగా, హర్యానా, పంజాబ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఠాకూర్ గతంలో పనిచేశారు. 2009లో ఆయనకు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించింది.

  • Loading...

More Telugu News