: బీహార్ ఫలితాలు వచ్చాక... లాలూ, నితీష్ లు పాక్ కు వెళ్లాలి: బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్


బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు వరుస వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపు జరగనున్న ఐదో దశ పోలింగ్ తో అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్నాయి. నవంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లపై బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్ చౌబే ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక వారిద్దరూ పాకిస్థాన్ కు వెళ్లాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు బీహార్ కు చెందిన బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కూడా లాలు, నితీష్ లపై ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. వారిద్దరూ బీహార్ ను పాక్ లా మార్చాలని భావిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News