: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 38 పాయింట్లు కోల్పోయి 26,553కు పడిపోయింది. నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 8,040 దగ్గర స్థిరపడింది. ఇవాల్టి టాప్ గెయినర్లలో జైన్ ఇరిగేషన్ (6.61%), టాటా మోటార్స్ (6.02%), రెడింగ్టన్ (ఇండియా) లిమిటెడ్ (5.71%), యూనైటెడ్ బ్రూవరీస్ (4.60%), దేనా బ్యాంక్ (4.59%)లు ఉన్నాయి. టాప్ లూజర్లలో కాక్స్ అండ్ కింగ్స్ (-4.88%), గోద్రెజ్ ప్రాపర్టీస్ (-4.11%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (-3.51%), ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ (-3.50%), వక్రాంగీ (-3.34%) కంపెనీలు ఉన్నాయి.