: కింది స్థాయి బీజేపీ నేతల వ్యాఖ్యలను పట్టించుకోం: చినరాజప్ప


తెలుగుదేశం పార్టీపై కింద స్థాయి బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలకు తాము ప్రాధాన్యత ఇవ్వమని, అసలు పట్టించుకోమని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలను సరఫరా చేసి, రానున్న రోజుల్లో రూ. 90కే కిలో కందిపప్పు అందేలా చూస్తామని చెప్పారు. బీసీలకు ఇబ్బందులు కలగని రీతిలో కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రకటించిన 196 మండలాలకు మరికొన్ని కరవు మండలాలను కలపబోతున్నట్టు వెల్లడించారు. కరవు మండలాలను ఆదుకోవడానికి రూ. 1400 కోట్ల నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News