: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ
బాలీవుడ్ లో లేటు వయసులో సక్సెస్ చూసిన నవాజుద్దీన్ సిద్దిఖీ ఆనారోగ్యం పాలయ్యాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, కిక్, భజరంగీ భాయ్ జాన్, మాంఝీ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న సిద్ధిఖీ ప్రస్తుతం షారూఖ్ రయీస్, రామన్ రాఘవ్ 2.0 సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ లో పాల్గొన్న సిద్దిఖీకి జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. కాగా, సిద్దిఖీ మగతలో ఉన్నారని, జ్వరం తగ్గినప్పటికీ ఆయన కోలుకోలేదని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. సిద్దిఖీ కోలుకోవాలని బాలీవుడ్ నటులు కోరుకుంటున్నారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుల్లో సిద్దిఖీ ఒకరని సల్మాన్, షారూఖ్ వంటి నటులు పేర్కొన్న సంగతి తెలిసిందే.