: రాజయ్య సహా ముగ్గురు కుటుంబసభ్యుల అరెస్ట్
కాంగ్రెస్ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య, భార్య మాధవి, కొడుకు అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో రాజయ్య ఇంటిముందు భారీగా పోలీసులు మోహరించారు. అంతకుముందు రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవల మృతదేహాలను పోలీసులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని, ఆ తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అంతకుముందు ఐజీ నవీన్ చంద్ర మీడియాకు తెలిపారు.