: కేరళలో పెంపుడు కుక్కలకు యునిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు !


కేరళలోని పెంపుడు జంతువులకు త్వరలో యునిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు రానున్నాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కలకు ఈ నంబర్లు తప్పనిసరిగా అక్కడి ప్రభుత్వం ఇవ్వనుంది. చిన్న మైక్రోచిప్ లాంటి దాంట్లో సదరు శునకానికి సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చి దాని చర్మం కింద దీనిని అమరుస్తామని సంబంధిత శాఖాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, శునకాల చర్మం కింద అమర్చే ఈ మైక్రోచిప్ పెద్ద బియ్యపుగింజ సైజులో ఉంటుందన్నారు. పెంపుడు జంతువు యజమాని ఎవరనే విషయాన్ని సులభంగా ఈ పద్ధతిలో తెలుసుకోవచ్చన్నారు. పెంపుడు కుక్కలు తప్పిపోయిన సందర్భాలలో రీడర్ సహాయంతో వాటి ఆచూకీ కనుగొనే అవకాశముంటుందన్నారు. ఈవిధంగా చేయడం ద్వారా పెంపుడు శునకాలకు సంబంధించిన మొత్తం సమాచారం తమ వద్ద ఉంటుందని అధికారులు వివరించారు. పెంపుడు శునకాలకు యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు కేటాయించే కార్యక్రమం వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొచ్చి సిటీ కార్పొరేషన్ నివేదిక ప్రకారం సిటీలో 7000 నుంచి 10,000 వరకు వీధి కుక్కలు ఉన్నాయి. వాటిలో నలభై శాతం శునకాలను పలు కారణాల రీత్యా వాటి యజమానులే వదిలిపెట్టేసినట్లు నివేదిక స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News