: రాజయ్య కుటుంబంపై ఎఫ్ఐఆర్ తప్పదు... అనుమానితులను అరెస్ట్ చేస్తాం: ఐజీ నవీన్ చంద్


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంటిలో నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై వరంగల్ రేంజీ ఐజీ నవీన్ చంద్ స్పందించారు. ఈ ప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు. ప్రమాదం రాజయ్య ఇంటిలోనే జరిగిన నేపథ్యంలో రాజయ్య కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని నవీన్ చంద్ తెలిపారు. అంతేకాక ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఘటన హత్యా? ఆత్మహత్యా? అన్న విషయం విచారణలో తేలుతుందని ఆయన పేర్కొన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని కూడా నవీన్ చంద్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News