: శివసేనను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాల్సిందే!: పాక్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ డిమాండ్
మహారాష్ట్రలో ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్న శివసేనపై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, ఆ దేశ మాజీ సైనికాధిపతి జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివసేనను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు నేటి ఉదయం ‘చానెల్ 92’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివసేన కార్యకలాపాలను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ముషార్రఫ్ విరుచుకుపడ్డారు. మోదీ వ్యవహార సరళి కారణంగానే భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు.