: నాదల్ తో కలిసి ఆడాలనుంది... మనసులో మాట బయటపెట్టిన సానియా మీర్జా


హైదరాబాదీ అమ్మాయి సానియా మీర్జా భారత టెన్నిస్ ఆశాకిరణంగా అవతరించింది. ఒకప్పటి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ మార్టినా హింగిస్ తో జత కట్టిన సానియా ప్రస్తుతం డబుల్స్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకుంది. ఈ కేలండర్ ఇయర్ లో ఏకంగా 10 టైటిళ్లను సాధించి సత్తా చాటింది. ఇటీవలే సింగపూర్ లో డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గి ఈ ఏడాది టోర్నీలను ముగించుకుని నిన్ననే హైదరాబాదు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే టీవీతో ఆమె పిచ్చాపాటిగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. మట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్ తో కలిసి ఆడాలని ఉందని ఆమె పేర్కొంది. అంటే, ఇప్పటికే మహిళల డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ చేజిక్కించుకున్న ఆమె ఇక మిక్స్ డ్ డబుల్స్ ర్యాంకులపైనా దృష్టి సారించినట్లేనన్నమాట.

  • Loading...

More Telugu News