: సారికను కావాలనే హత్య చేశారు: సోదరి అర్చన
మాజీ ఎంపీ, వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలైన తన సోదరి సారిక మృతిపై ఆమె కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని సోదరి అర్చన అన్నారు. సారికను కావాలనే హత్య చేశారని ఆరోపించారు. చనిపోయిన సారిక, పిల్లలను చూసేందుకు ఆమె తల్లి, సోదరి అర్చన బయలుదేరారు. కాగా సారిక తండ్రి ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.